ప్రారంభమైన దొంగ మల్లన్న జాతర ఉత్సవాలు

  •  ఈనెల 29 వరకు జాతర

గొల్లపల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో దొంగమల్లన్న జాతర ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. దండి వారంతో ప్రారంభమైన జాతర ఉత్సవాలు ప్రతి ఆది, బుధవారాల్లో ఈ నెల 29 వరకు ఏడు వారాల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. శుక్రవారం రాత్రి మల్లికార్జున స్వామి కల్యాణం జరగగా దండివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామికి బోనం తీసి మొక్కులు చెల్లించుకున్నారు.

అలాగే పట్నాలు వేశారు. భక్తులు క్యూలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గంటల తరబడి నిరీక్షించవలసిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు 20 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకోగా ఆలయానికి హుండీ ద్వారా రూ.65వేల ఆదాయం సమకూరినట్లు ఈవో విక్రమ్ పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ధర్మపురి సీఐ రాంనర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.